భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్తున్నారు. రష్యా అధ్యక్షతన కజాన్‌లో జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ అక్టోబర్ 22, 23న రష్యాలో పర్యటించనున్నారు.
జస్ట్ గ్లోబల్ డెవలప్‌మెంట్ మరియు సెక్యూరిటీ కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం అనే థీమ్‌తో జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం ప్రపంచ సమస్యలను చర్చించడానికి నాయకులకు కీలక వేదికగా ఉపయోగపడుతుంది. పాల్గొనేవారు BRICS ప్రారంభించిన వివిధ కార్యక్రమాల పురోగతిని అంచనా వేస్తారు. భవిష్యత్ లో దేశాల మధ్య సహకారం కోసం పని చేస్తారు.
Prime Minister Narendra Modi will visit Russia from 22-23 October 2024 at the invitation of Russian President Vladimir Putin, to attend the 16th BRICS Summit, being held in Kazan, under the Chairmanship of Russia.
— ANI (@ANI) October 18, 2024
During his visit, the Prime Minister is also expected to hold… pic.twitter.com/EtaYKqgebU
బ్రిక్స్ లో మొదటి బ్రెజిల్, చైనా, రష్యా,ఇండియా, సౌత్ ఆఫ్రికా మాత్రమే ఉండేవి.. తర్వాత మరో ఐదు దేశాలు జాయింన్ అయ్యాయి. ప్రధాని మోదీ తన పర్యటనలో బ్రిక్స్ సభ్య దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
ALSO READ | కెనడా చెబుతున్నది అబద్ధం..దౌత్యవేత్తలను మేమే వెనక్కి తీసుకున్నం: భారత్