సాధువైన యోగి టెక్నాలజీని నమ్ముతుంటే అంధవిశ్వాసాలను నమ్మేవాళ్లు తెలంగాణను పాలిస్తున్నారని ప్రధాని మోడీ చురకలంటించారు. 21వ శతాబ్దంలోనూ సీఎం అంధ విశ్వాసాలను నమ్ముతున్నారని సటైర్ వేశారు. మూఢనమ్మకాలను విశ్వసించే వ్యక్తులు తెలంగాణకు ఎలాంటి న్యాయమూ చేయలేరన్న మోడీ.. అలాంటి వ్యక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. తాను సైన్స్ ను నమ్ముతానని.. మూఢనమ్మకాలను కాదని మోడీ స్పష్టం చేశారు. ఒక కుటుంబం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని.. రాష్ట్రానికి ఆ కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ప్రతి బీజేపీ కార్యకర్త ఇదే ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కుటుంబపాలకుల వల్ల యువతకు రాజకీయాల్లో అవకాశాలు రావడంలేదని మోడీ అభిప్రాయపడ్డారు. కుటుంబపాలన నుంచి విముక్తి కల్పించడమే తన సంకల్పమని స్పష్టం చేశారు. కుటుంబపాలన ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడిందన్న ప్రధాని.. రాష్ట్ర భవిష్యత్తు, గౌరవం కోసం బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని ప్రసంగం సమయంలో సభా ప్రాంగణం భారత్ మాతాకీ జై, మోడీ నినాదాలతో మార్మోగింది.
మరిన్ని వార్తల కోసం
తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం పక్కా