ఏరో ఇండియా ఆత్మనిర్బర్‌కు ఉత్సాహాన్నిస్తుంది

ఏరో ఇండియా అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు సంబంధించి 13వ ఎడిషన్ బెంగుళూరులో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం దేశానికి ఉత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ‘ఈ కార్యక్రమం ఆత్మనిర్భర్ (స్వావలంబన) కావాలన్న దేశ తపనకు ఉత్సాహాన్ని ఇస్తుంది. రక్షణ మరియు ఏరోస్పేస్లో భారతదేశం అపరిమిత సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ రంగాలలో సహకారానికి ఏరో ఇండియా ఒక అద్భుతమైన వేదిక. భారత ప్రభుత్వం ఈ రంగాలలో నూతన సంస్కరణలను తీసుకువచ్చింది’ అని పీఎం మోడీ ట్వీట్ చేశారు.

For More News..

రామ్ మందిర్ నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్న కాంగ్రెస్ యూత్ వింగ్

ఎంపీలకు వార్నింగ్ ఇచ్చిన వెంకయ్య నాయుడు

ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న సీనియర్ నటి రాధిక