పంట పెట్టుబడి తగ్గాలె.. రైతుల ఆమ్దాని పెరగాలె

పంట పెట్టుబడి తగ్గాలె.. రైతుల ఆమ్దాని పెరగాలె

అగ్రి సెక్టార్ బలోపేతానికి చేయాల్సిందల్లా చేస్తున్నం: మోడీ
గుజరాత్లో మూడు ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని
ఇండియా సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ లో వరల్డ్ లోనే ఆరో స్థానంలో ఉందని వెల్లడి

అహ్మదాబాద్: రైతన్నలు ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోడీ చెప్పారు. ఫార్మర్ల ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు, ప్రొడక్షన్ కాస్ట్ను తగ్గించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గుజరాత్లో మూడు ప్రాజెక్టులను న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ శనివారం ప్రారంభించారు. రైతులకు పొద్దున టైమ్ లో కరెంటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ సూర్యోదయ్ యోజన పథకం, అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లో రూ. 470 కోట్లతో కట్టిన పీడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్, జునాగఢ్ సిటీకి దగ్గర్లో మౌంట్ గిర్నార్ పై నిర్మించిన రోప్వేను స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో ఎక్కడైనా పంట ఉత్పత్తులను అమ్ముకోవడం దగ్గర్నుంచి వేలాది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, 100 శాతం నీమ్ కోటెడ్ యూరియా, సాయిల్ హెల్త్ కార్డులు, పంట బీమా పథకం ఇలా అన్నీ రైతుల కోసమే తీసుకొచ్చాం’ అని మోడీ చెప్పారు.

ఆసియాలోనే పొడవైన టెంపుల్ రోప్ వే
గిర్నార్ రోప్ వే ను 1983లో ప్రతిపాదించారని.. అది ఆలస్యమవడానికి ప్రతిపక్షాలే కారణమని మోడీ విమర్శించారు. ఈ కొత్త ప్రాజెక్టు వల్ల టూరిస్టులు, యాత్రికులు పెరిగి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ‘ఆధునిక సౌకర్యాలుంటేనే ఏ ప్రాంతానికైనా ఎక్కువ మంది టూరిస్టులొస్తారు’ అని చెప్పారు. 2.3 కిలోమీటర్లున్న ఈ రోప్వే ఆసియాలోనే అతి పొడవైన టెంపుల్ రోప్వేగా రికార్డుకెక్కింది. సోలార్ ఎనర్జీపై డీటెయిల్డ్ పాలసీని రూపొందించిన తొలి రాష్ట్రం గుజరాత్ అని మోడీ పొగిడారు. 2010లో సోలార్ పవర్ ప్లాంట్ను పటన్లో స్టార్ట్ చేసినప్పుడు ప్రపంచానికి ‘వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్’ మార్గాన్ని ఇండియా చూపిస్తుందని ఎవరూ అనుకోలేదని.. ప్రస్తుతం ప్రపంచంలో సోలార్ ప్రొడక్షన్, వాడకంలో ఇండియా ముందుందని చెప్పారు. గత ఆరేళ్లలో సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఇండియా ప్రపంచంలో ఆరో దేశంగా కొనసాగుతోందన్నారు.

For More News..

పంజాబ్లో ఆరేళ్ల దళిత చిన్నారిపై రేప్.. ఈ ఘటనపై గాంధీలు మాట్లాడరా?

ప్రతి ప్లాటుకు ఎల్ఆర్ఎస్.. టార్గెట్ 25 లక్షల ప్లాట్లు

హైదరాబ్యాడ్ షో.. ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్న సన్ రైజర్స్