
ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు.
ఢిల్లీ రైల్వే్స్టేషన్లో ఫిబ్రవరి 15 రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా..మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు,నలుగురు పురుషులు ఉన్నారు. కుంభమేళాకు వెళ్తున్న భక్తులు రైల్వే స్టేషన్ కు పోటెత్తడంతో 14,15 ఫ్లాట్ ఫామ్ లదగ్గర తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్న రైల్లు రద్దయ్యాయనే వదంతులతో జనం ఒక్కసారిగా గందరగోళానికి గురవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నంబర్ 14 వద్ద నిలబడి ఉన్నప్పుడు, ప్లాట్‌ఫామ్ వద్ద చాలా మంది ప్రజలు ఉన్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఆలస్యంగా వచ్చాయి, ఈ రైళ్ల ప్రయాణికులు ప్లాట్‌ఫామ్ నంబర్ 12, 13 , 14 వద్ద కూడా ఉన్నారు. సమాచారం ప్రకారం 1500 జనరల్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి - అందుకే జనసమూహం అదుపు తప్పింది. ప్లాట్‌ఫామ్ నంబర్ 14 వద్ద , ప్లాట్‌ఫామ్ నంబర్ 1 సమీపంలోని ఎస్కలేటర్ దగ్గర తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) రైల్వే, తెలిపారు.