చారిత్రాత్మక బిల్లులు తెస్తున్నాం.. 2047 వరకు భారత్ అభివృద్ధి

చారిత్రాత్మక బిల్లులు తెస్తున్నాం.. 2047 వరకు భారత్ అభివృద్ధి

 వికసిత్ భారత్ లక్ష్యంగా  కేంద్ర బడ్జెట్ ఉంటుందన్నారు ప్రధాని మోదీ. పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన మోదీ..   ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు అన్నీ అంశాలపై  చర్చకు సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

ఈ సమావేశాల్లో చారిత్రాత్మక బిల్లులు ప్రవేశ పెడుతున్నామని తెలిపారు మోదీ.  దేశంలోని పేదలు, మధ్యతరగిత ప్రజలపై లక్ష్మీ దేవి కరుణ ఎప్పటికీ ఉండాలని కోరారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ పెట్టబోతున్నామని తెలిపారు మోదీ.   140 కోట్ల మంది ప్రజల సంకల్పాన్ని  పరిపూర్ణం చేస్తామన్నారు. బడ్జెట్ లో దేశంలో యువతకు ప్రాధాన్యత ఇస్తుంది.

ALSO READ : కేంద్ర​ బడ్జెట్ 2025 : మూల ధన వ్యయం అంటే ఏంటి.?

2047 వరకు దేశం అభివృద్ధి చెందుతుందన్నారు ప్రధాని మోదీ.  ఇన్నోవేషన్, ఇన్వెస్ట్ మెంట్ కు  ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మూడోసారి ప్రజలు ఎన్డీయే పట్టం కట్టారని..   దేశ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నామన్నారు.  ఈ బడ్జెట్ ప్రజల్లో విశ్వాసాన్ని ఇస్తుందన్నారు. సమ్మిళిత ఆవిష్కరణలు, పెట్టుబడులే లక్ష్యంగా పనులు చేస్తున్నామని తెలిపారు.