పదేళ్లలో జరిగిన అభివృద్ధి జస్ట్ ట్రైలర్ మాత్రమే అన్నారు ప్రధాని మోదీ..రెండో రోజు రష్యాలో పర్యటిస్తున్న మోదీ..మాస్కోలో భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు.. దేశం మారుతోందని ప్రపంచమంతా గర్విస్తోందన్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు దేశాన్ని చూసి గర్విస్తున్నారని చెప్పారు. మహిళలను లక్షాధికారులను చేస్తున్నామన్నారు. భారత్ లో పేదల కోసం 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
భారత్ జీ20 సదస్సును సమర్థవంతంగా నిర్వహించిందన్నారు మోదీ. కోవిడ్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. భారత్ ను ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సురెన్స్ స్కీంను అమలు చేస్తున్నామని తెలిపారు. 2024కు ముందు దేశం నిరాశతో ఉండేది.. ఇపుడు ఆత్మవిశ్వాసంతో నిండి ఉందన్నారు మోదీ.
డిజిటల్ పేమెంట్స్ తో కొత్త రికార్డులు సృష్టిస్తున్నామని చెప్పారు మోదీ. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో రైల్వే బ్రిడ్జి నిర్మించామని.. దేశ అభివృద్ధిలో140 కోట్ల మంది భారతీయుల పాత్ర ఉందన్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచి దేశం సంబురాలు చేసుకుంది.. చివరి వరకు టీమిండియా పోరాడింది. ఒటమి ఒప్పుకోని వారినే విజయం వరిస్తుందన్నారు. భారత్ రష్యా మద్య సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయన్నారు మోద.
10 సంవత్సరాలలో సెమీకండక్టర్ల నుంచి ఎలక్ట్రానిక్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల వరకు మరింత వేగంగా అభివృద్ధి చెందబోతున్నామని చెప్పారు. సవాళ్లను స్వీకరంచడంలో భారత్ ముందంజలో ఉంటుందన్నారు.
#WATCH | Moscow, Russia: Prime Minister Narendra Modi says "...India is sending a great team to the Paris Olympics. You will see how the entire team and athletes will show their strength. This self-confidence of the youth is the real capital of India and this youth power shows… pic.twitter.com/Us4TtBHB2q
— ANI (@ANI) July 9, 2024