ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు..పాక్ ఉగ్రదాడుల్ని తిప్పి కొడతాం: మోదీ

ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు..పాక్ ఉగ్రదాడుల్ని తిప్పి కొడతాం: మోదీ

 ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదన్నారు ప్రధాని మోదీ.. పాకిస్తాన్ ఉగ్రదాడుల్ని తిప్పికొడతామని చెప్పారు. పాకిస్తాన్ ఎన్ని సార్లు  దెబ్బతిన్నా దాని బుద్ధి మారలేదని..ఇప్పటికీ ఉగ్రవాదాన్నిపెంచి పోషిస్తుందన్నారు మోదీ. కార్గిల్ 25వ విజయ్ దివాస్  సందర్భంగా  లడఖ్ లోని కార్గిల్ మెమోరియల్ వార్ దగ్గర  నివాళి అర్పించారు మోదీ.

ఈ సందర్భంగా కార్గిల్ వార్ ను ఉద్దేశించి మాట్లాడారు మోదీ.  అమరుల త్యాగాలకు గుర్తుగా విజయ్ దివస్ జరుపుకుంటున్నామని  చెప్పారు. కార్గిల్  విజయంతో భారత  సైనిక శక్తి సామర్థ్యాలు ఏంటో  ప్రపంచానికి  చాటి చెప్పామన్నారు.  కార్గిల్ యుద్ధానికి సాక్షి లద్దాఖ్ అని అన్నారు.   సైనికుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు.  దేశ రక్షణ కోసం వీరమరణం పొందిన సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.  కార్గిల్ యుద్ధంలో ఎంతో మంది సైనికులు వీరమరణం పొందారన్నారు. సైనికులు చేసిన పోరాటం తన మదిలో నిలిచిపోతుందన్న మోదీ.. దేశ ప్రజలు గర్వించ దగ్గర విజయమన్నారు. 

కార్గిల్ విజయం భారత సైనికుల పరాక్రమణకు నిదర్శనమన్నారు మోదీ.  దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి.   1999లో కార్గిల్ యుద్ధంలోపాల్గొన్న సైనికులను కలిశాను. కార్గిల్ యుద్ధ సమయంలో ఒక సామాన్యుడిలా  సైనికుల మధ్యలో ఉన్నా. జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి పెద్ద పీఠ వేస్తున్నాం.లద్దాక్ కుభారీగా నిధులు కేటాయించాం.   కశ్మీర్ లో జీ20  సదస్సు నిర్వహించాం. కశ్మీర్ లో మౌళిక  సదుపాయాలను మెరుగుపరిచాం. లద్దాక్ ను కలిపే టన్నెల్ పూర్తయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. శ్రీనగర్,లద్దాక్ లో అభివృద్ధి జరుగుతోంది.  ఒకప్పుడు లద్దాక్ లో నీళ్లు కూడా దొరికేవి కావు. 

 ఎంతో మంది జవాన్ల త్యాగంతో కార్గిల్ యుద్ధం గెలిచిందన్నారు మోదీ. దేశ రక్షణ రంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం.  ఆర్మీ జవాన్ల త్యాగ ఫలితంతో కశ్మీర్ లో శాంతి నెలకొంది. కొంత మంది సైన్యాన్ని బలహీనంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మోదీ.