ఇది ప్రజా బడ్జెట్.. సామాన్యుల జేబులు నింపడంపైనే మా దృష్టి : మోదీ

ఇది ప్రజా బడ్జెట్.. సామాన్యుల జేబులు నింపడంపైనే మా దృష్టి : మోదీ
  • 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు నెరవేరుస్తది: ప్రధాని మోదీ
  • సామాన్యుల జేబులు నింపడంపైనే మా దృష్టి
  • పన్ను చెల్లింపుల రూపంలో భారీ ఊరట ఇచ్చినం
  • వచ్చే వారం బిల్లు పెట్టి ట్యాక్స్ విధానాన్ని సులభతరం చేస్తం
  • అణు ఇంధన రంగంలో పెట్టుబడులకు తలుపులు తెరిచాం
  • యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్తాయని వ్యాఖ్య

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. ‘ప్రజా బడ్జెట్’అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ బడ్జెట్.. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్ అని కొనియాడారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్​సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని మోదీ వీడియో రిలీజ్ చేశారు. ‘‘నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. పెట్టుబడులను పెంచుతుంది. ఇండియా డెవలప్​మెంట్ జర్నీలో ఇదొక కీలకమైన మైలు రాయి. ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతీ భారతీయుడి కలను నెరవేరుస్తుంది. అనేక రంగాల్లో యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయి. సామాన్యులే వికసిత్‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌ను ముందుకు తీసుకువెళ్లేలా ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ తోడ్పడుతుంది. సాధారణంగా ప్రభుత్వ ఖజానాను ఎలా నింపాలన్నదానిపై బడ్జెట్‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. కానీ.. ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ సామాన్యుల జేబులు ఎలా నింపాలన్నదానిపై దృష్టి పెట్టి రూపొందించినది’’అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

50 టూరిస్ట్ స్టేషన్లలో హోటళ్లు నిర్మిస్తం

షిప్​ల తయారీ రంగంలో చాలా మందికి ఉపాధి లభిస్తుందని ప్రధాని మోదీ వివరించారు. 50 కీలకమైన టూరిస్ట్ స్టేషన్లలో హోటళ్లను నిర్మిస్తామన్నారు. మౌలిక సదుపాయాల పరిధిలోకి హోటళ్లను తీసుకురావడంతో టూరిజం సెక్టార్​కు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు. ‘‘అణు ఇంధన రంగంలో ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ పెట్టుబడులకు తలుపులు తెరవడం​ లాంటి చర్యలు ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో తీసుకువచ్చిన గొప్ప సంస్కరణ. హాస్పిటాలిటీ సెక్టార్​కు ఈ బడ్జెట్ సరికొత్త ఎనర్జీ ఇస్తుంది. అదేవిధంగా, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి’’అని ప్రధాని మోదీ అన్నారు. గిగ్ వర్కర్ల విషయంలో సామాజిక భద్రత కల్పించామని తెలిపారు. తాము తీసుకున్న ఈ నిర్ణయం.. గిగ్ వర్కర్ల గౌరవం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు. 

పన్ను చెల్లింపుల్లో 7 శ్లాబులు తీసుకొచ్చినం

పన్ను చెల్లింపుల రూపంలో మధ్య తరగతి ప్రజలకు తమ ప్రభుత్వం ఎంతో ఊరట ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. రూ.12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్​ చెల్లించాల్సి ఉండదని తెలిపారు. పన్నుల చెల్లింపుల్లోనూ 7 శ్లాబులు తీసుకొచ్చామన్నారు. దీంతో మధ్య తరగతి ప్రజల వద్ద సేవింగ్స్ పెరుగుతాయని తెలిపారు. ‘‘ఆదాయ పన్ను విధానంలో సంస్కరణలకు కీలక ముందడుగు వేశాం. వచ్చే వారం ఆదాయ పన్నుపై బిల్లును తీసుకొస్తాం. ఈ బిల్లు ఆదాయ పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తుంది. టూరిజం, హాస్పిటాలిటీ సెక్టార్ల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. షిప్ బిల్డింగ్, మెరైన్​టైమ్ ఇండస్ట్రీస్, దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల ఆర్థిక బలోపేతానికి ఊతం ఇస్తుంది. బడ్జెట్​లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చాం. రాబోయే కొన్నేండ్లలో ఆర్థిక రంగంలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకొస్తాం. భారీ నౌకల నిర్మాణ పరిశ్రమను ప్రోత్సహిస్తాం’’అని ప్రధాని మోదీ అన్నారు.