కరోనా ఇంకా పోలేదని అందరికీ చెప్పండి

కరోనా ఇంకా పోలేదని అందరికీ చెప్పండి
  • కేసులు పెరుగుతున్నయ్.. మనకిది వార్నింగ్
  • టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకా వ్యూహంతో థర్డ్ వేవ్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకోండి: మోడీ
  • ఆరు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
  • కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరగడం ఆందోళనకరం
  • ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పీఎం వీడియో కాన్ఫరెన్స్

టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకా వ్యూహంతో థర్డ్ వేవ్‌‌ రాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అమెరికా, యూరప్‌‌లో థర్డ్ వేవ్ వల్ల కేసులు పెరుగుతున్నాయి. ఇండియాకు తూర్పున ఉన్న బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయ్​లాండ్, మయన్మార్ దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఇది మనకు వార్నింగ్. వారంలో నమోదైన కేసుల్లో 80 శాతం, డెత్స్‌‌లో 84 శాతం ఆరు రాష్ట్రాలవే. సెకండ్ వేవ్​కు ముందు జనవరి, ఫిబ్రవరిలోనూ ఇదే జరిగింది.     
‑ ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ/చెన్నై: కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగించే విషయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకా వ్యూహంతో థర్డ్ వేవ్‌‌‌‌‌‌‌‌ రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘‘ప్రస్తుతం అమెరికా, యూరప్‌‌‌‌‌‌‌‌లో థర్డ్ వేవ్ వల్ల కేసులు పెరుగుతున్నాయి. ఇండియాకు తూర్పున ఉన్న బంగ్లాదేశ్, ఇండొనేషియా, థాయ్​లాండ్, మయన్మార్ తదితర దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఇది ప్రపంచానికి, మనకు వార్నింగ్, పెద్ద అలర్ట్ కూడా. కరోనా ఇంకా పోలేదన్న విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలి” అని వివరించారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం మాట్లాడారు.

80% కేసులు, 84% డెత్స్ ఆరు రాష్ట్రాల్లోనే..
థర్డ్ వేవ్ వస్తుందన్న భయాందోళనలో దేశం ప్రస్తుతం ఉందని మోడీ చెప్పారు. గత వారం నమోదైన మొత్తం కేసుల్లో 80 శాతం, డెత్స్‌‌‌‌‌‌‌‌లో 84 శాతం ఆరు రాష్ట్రాల నుంచే వచ్చాయన్నారు. కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరడగడం దేశానికి తీవ్ర ఆందోళన కలిగేంచే విషయమన్నారు. సెకండ్ వేవ్ రావడానికి ముందే జనవరి, ఫిబ్రవరిలో కూడా ఇలానే జరిగిందని చెప్పారు. మైక్రో కంటెయిన్‌‌‌‌‌‌‌‌మెంట్ జోన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పబ్లిక్ ప్లేసుల్లో జనం గుమిగూడకుండా చూసుకోవాలని, దీనిపై అవగాహన, అప్రమత్తత అవసరమన్నారు. ఐసీయూ బెడ్లు, టెస్టింగ్ కెపాసిటీ పెంపు, ఇతర అవసరాల కోసం కావాల్సిన నిధులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ కింద రూ.23 వేల కోట్ల ప్యాకేజ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసినట్లు పేర్కొన్నారు. పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడుకోవాలని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఎక్కువ కాలం పాటు కేసులు పెరుగుతూ ఉంటే.. కరోనా మ్యుటేషన్లు పెరుగుతాయని, కొత్త వేరియంట్ల వల్ల ప్రమాదాలూ పెరుగుతాయని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులు చెబుతున్నారని అన్నారు. కేసులు పెరుగుతున్న జిల్లాలపై ఫోకస్ పెట్టాలని సీఎంలకు సూచించారు.

కోటి డోసులివ్వండి: స్టాలిన్
తమిళనాడుకు వ్యాక్సిన్లను తక్కువగా ఇస్తున్నారని, జనాభాకు తగినట్లుగా ఇవ్వడంలేదని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. తమ రాష్ట్రాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి కోటి డోసులు ఇవ్వాలని ప్రధాని మోడీని కోరారు. కరోనాపై పోరాటంలో ఉపయోగించే వస్తువులన్నింటిపై జీఎస్టీని ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు. నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించాలనే నిర్ణయంపై కేంద్ర పునరాలోచించుకోవాలని, ఈ ఎగ్జామ్స్ వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని చెప్పారు.

మరిన్ని డోసులు ఇయ్యాలె: కేరళ సీఎం
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్​ను తగ్గించేందుకు కేరళకు మరిన్ని వ్యాక్సిన్​ డోసులు కేటాయించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని మోడీని కోరారు.  ఏప్రిల్​లో ప్రారంభమైన సెకండ్ వేవ్ లో డెల్టా వేరియెంట్‌‌‌‌‌‌‌‌ కేసులను కూడా గుర్తించామని చెప్పారు. అప్పుడు వైరస్ పాజిటివిటీ రేట్ 30శాతానికి పెరిగిందని వెల్లడించారు.