అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి కృషి

అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి కృషి

ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం 11.15 గంటల సమయంలో ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా తదితరులు ఈ అమెరికా ప్రయాణమయ్యారు. ప్రధాని బయలుదేరే ముందు తన పర్యటనపై ఒక ప్రకటన విడుదల చేశారు. తాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ఆ దేశం వెళ్తున్నానని, అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చిస్తామని మోడీ తెలిపారు. ఈ నెల 22 నుంచి -25 వరకు అమెరికా పర్యటన కొనసాగుతుందని చెప్పారు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌ను కూడా కలవనున్నట్లు చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో సహకారం గురించి ఆమెతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అమెరికాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంలో ఈ పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నానని తెలిపారు.

ఈ పర్యటన సందర్భంగా వైట్‌ హౌస్‌లో జరిగే క్వాడ్‌ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్ననున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మారిసన్, జపాన్ పీఎం యొషిహిడే సుగాతో కలిసి క్వాడ్ లీడర్ల ప్రత్యక్ష సదస్సులో పాల్గొంటానని మోడీ తెలిపారు. మార్చిలో జరిగిన వర్చువల్ సదస్సులో చర్చించిన అంశాలు, ఇండో- పసిఫిక్ ప్రాంతంలో ప్రాధాన్యతలు తదితర అంశాల గురించి ఇందులో చర్చిస్తామని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునే అంశాలపైనా చర్చిస్తామన్నారు. అలాగే పర్యటన చివరి రోజున ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడంతో తన పర్యటన ముగుస్తుందని తెలిపారు. కొవిడ్-19 సహా ప్రపంచవ్యాప్త సవాళ్లు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత, వాతావరణ మార్పులు సహా మరికొన్ని ముఖ్యమైన అంశాలపై ప్రసంగించనున్నట్లు చెప్పారు.

Read More:

 

సెప్టెంబర్ 25న ఆన్ లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు

‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్, సాయి ధరమ్ హెల్త్‌పై చిరు ట్వీట్

సామాన్యులకు దహనం.. స్వామీజీలకు సమాధి: ఇలా ఎందుకంటే?