సర్దార్ పటేల్ దేశాన్ని విచ్చిన్నం కాకుండా కాపాడారని ప్రధాని మోదీ అన్నారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ లోని యూనిటీ ఆప్ స్టాచ్యూ దగ్గర పటేల్ విగ్రహానికి మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. సర్దార్ పటేల్ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. దేశ ఐక్యత కోసం పటేల్, శివాజీ ఎంతో కృషి చేశారని చెప్పారు. ఒక దేశం, ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చాం..ఆర్టికల్ 370 గోడలను బద్దలు కొట్టామన్నారు మోదీ.
ఆయష్మాన్ బారత్ తో పేదలకు ఉచిత వైద్యం అందుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వన్ రేషన్, వన్ నేషన్ తో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని.. ఇపుడు వన్ నేషన్, వన్ ఎలక్షన్ కోసం పనిచేస్తున్నామని చెప్పారు. హర్ ఘర్ జల్ స్కీమ్ తో ప్రతి ఇంటికి నీటిని అందించామన్నారు మోదీ. దేశంలో నక్సలిజం లేకుండా చేశామన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ తో దేశంలో అసమానతలు పోతాయన్నారు.