ఎన్సీసీ పరేడ్‌లో ప్రధాని మోడీ న్యూ లుక్

ఎన్సీసీ పరేడ్‌లో ప్రధాని మోడీ న్యూ లుక్

దేశ రాజధాని ఢిల్లీలోని కరియప్ప గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన ఎన్సీసీ కేడెట్ పరేడ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ కొత్త లుక్‌లో కనిపించారు. సిక్కు కేడెటె టర్బన్‌ను ధరించి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్సీసీ కంటింజెంట్‌ నిర్వహించిన మార్చ్ పాస్ట్‌ను రివ్యూ చేసిన ఆయన కేడెట్స్‌ నుంచి గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్‌‌)ను స్వీకరించారు.

నేనూ ఎన్సీసీ కేడెట్‌నే.. నాకు గర్వంగా ఉంది

ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ తాను కూడా ఎన్సీసీలో యాక్టివ్ మెంబర్‌‌ కావడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. తమ ప్రభుత్వం ఎన్సీసీని బలోపేతం చేసేందుకు చాలా నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. ఇవాళ జరిగిన పరేడ్‌లో చాలా మంది బాలికలు కేడెట్స్‌గా కనిపిస్తున్నారని, ఈ మార్పు తమ ప్రభుత్వం తీసుకొచ్చిందేనని, దీనిని నేడు యావత్ దేశమంతా చూస్తోందని మోడీ అన్నారు. 

కాగా, రిపబ్లిక్ డే వేడుకల అనంతరం ఏటా జవనరి 28న ఎన్సీసీ కేడెట్స్ పరేడ్ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. పైగా అజాదీ అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది ఏడు రోజుల పాటు రిపబ్లిక్‌ డే వేడుకలు జరుగుతున్నాయి.  ఈ నెల 23 నుంచి మొదలైన వేడుకల్లో ఇవాళ ఎన్సీసీ కంటింజెంట్‌ ఈవెంట్స్ చివరి రోజు కావడంతో ఈ పరేడ్‌కు ప్రధాని చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ఆర్మీ యాక్షన్, మైక్రో లైట్ ఫ్లైయింగ్, పారా సైలింగ్ వంటి వాటిలో ఎన్సీసీ కేడెట్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కేడెట్ల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించిన అనంతరం ఉత్తమ కేడెట్లకు మెడల్స్‌ను ప్రధాని బహూకరించారు.

మరిన్ని వార్తల కోసం..

సీఎం పదవి దక్కకుంటే సిద్దూ పాకిస్థాన్‌కు వెళ్తాడు

ముస్లిం ఓట్లు.. ఎంఐఎంకు మళ్లించడమే అమిత్ షా టార్గెట్

మరో కొత్త వైరస్ భయం.. సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరి మృతి