ఎన్టీఆర్ అమెరికా పోతే కాంగ్రెస్ ఆయన సర్కారు కూల్చింది :మోడీ

ఎన్టీఆర్ అమెరికా పోతే కాంగ్రెస్ ఆయన సర్కారు కూల్చింది :మోడీ

రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ప్రధాని నరేంద్రమోడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పై మోడీ పైర్ అయ్యారు. ఆరు దశాబ్ధాలకుపైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ సర్కార్ తీరు చూస్తే బాధ, కోపం వస్తుందన్నారు. దేశ ప్రగతిని కాంగ్రెస్ నాశనం చేసిందన్న ఆయన... దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతమన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆర్టికల్ 356ను 50సార్లకుపైగా దుర్వినియోగం చేశారని మోడీ మండిపడ్డారు. తమిళనాడులో ఎంజీఆర్,, ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వాలను కాంగ్రెస్  అక్రమంగా కూలగొట్టిందని ఆరోపించారు. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్తే తిరిగొచ్చేసరికి  ఆయన ప్రభుత్వమే లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ సొంతమని అన్నారు. అంతటి ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను కూల్చుతోందని బీజేపీపై ఆరోపణ చేయడం ఎంత వరకు సమంజసమని మోడీ ప్రశ్నించారు.