దేవభూమిలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలివే.. లిస్టవుట్ చేసిన మోదీ

ఉత్తరాఖండ్ పితోర్‌ఘర్‌లోని పార్వతి కుండ్ భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. దాదాపు 5వేల 338 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హిందూ పుణ్యక్షేత్రాన్ని ఏటా వేల మంది సందర్శిస్తారు. ఈ ప్రదేశం గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శివుడు, పార్వతి దేవి ధ్యానం చేసిన ప్రదేశంగా చాలా మంది విశ్వసిస్తారు కూడా. ఇటీవలే ఈ ప్రదేశాన్ని సందర్శించిన ప్రధాని మోదీ... పార్వతి కుండ్, జగేశ్వర్ ఆలయాలను సందర్శించడం చాలా ప్రత్యేకమైనదని చెప్పారు. ప్రకృతి సౌందర్యం, దైవత్వం కోసం ఈ పవిత్ర స్థలాలను తప్పక సందర్శించాలని ఆయన సూచించారు.

"ఉత్తరాఖండ్‌లో సందర్శించాల్సిన ప్రదేశం ఏదైనా ఉంటే, అది ఈ ప్రదేశం అనే నేను చెబుతాను. రాష్ట్రంలోని కుమావోన్ ప్రాంతంలో ఉన్న పార్వతి కుండ్, జగేశ్వర్ ఆలయాలను మీరు తప్పనిసరిగా  సందర్శించాలి. అక్కడి ప్రకృతి సౌందర్యం, దైవత్వం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది" అని మోదీ ఎక్స్ లో రాసుకువచ్చారు.

Also Read : Threads: థ్రెడ్స్ యాప్‌లో కొత్త ఫీచర్.. పోస్టులను ఎడిట్ చేసుకోవచ్చు..!

"వాస్తవానికి, ఉత్తరాఖండ్ లో సందర్శించదగినవి అనేక ప్రసిద్ధ ప్రదేశాలున్నాయి. నేను చాలా సార్లు ఆ రాష్ట్రాన్ని సందర్శించాను. అక్కడ కేదార్‌నాథ్, బద్రీనాథ్ పవిత్ర స్థలాలు ఉన్నాయి. ఇవి మరపురాని అనుభవాలు. కానీ, చాలా సంవత్సరాల తర్వాత పార్వతి కుండ్, జగేశ్వర్ ఆలయాలకు వెళ్లడమనేది ఎంతో ప్రత్యేకమైంది" అని మోదీ అన్నారు.

అంతకుముందు ఉత్తరాఖండ్‌లోని 'దేవభూమి' పర్యటన చేసిన ప్రధాని మోదీ.. పితోర్‌ఘర్‌లోని పార్వతి కుండ్‌లో ప్రార్థనలు చేసి పూజలు చేశారు. ప్రధాని మోదీ తన నివాసంలో పవిత్ర ఆది-కైలాసుడి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మోదీ అల్మోరాలోని జగేశ్వర్ ధామ్‌ను సందర్శించి, ప్రముఖ పుణ్యక్షేత్రంలో ప్రార్థనలు చేశారు.