ఢిల్లీలో ప్రధాని మోదీ ఈరోజు(మార్చ్ 8న) నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. ఈ అవార్డలకు దేశవ్యాప్తంగా 20 కేటగిరీల్లో 1.5 లక్షలకు పైగా నామినేషన్ వచ్చాయి. వీరిలో 23 మందికి నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ దక్కాయి. వీరిలో ముగ్గురు ఇంటర్నేషన్ వైజ్ గా ఉన్నారు. వివిధ ఫ్లాట్ ఫాంలో డిజిటల్ కంటెంట్ అందించే యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా పేజీలకు 10లక్షల ఓట్లు పోలయ్యాయి. 23 మంది విజేతలను నిర్ణయించారు.
సోషల్ మీడియాలో నేషనల్ క్రియేటర్స్ అవార్డులు ప్రకటించేవారు. ఈ వేదికపై ప్రధాని చిన్ననాటిలో ఓ అనుభవాన్ని పంచుకున్నారు. రిలిజియన్, కల్చర్, ఆస్ట్రాలజీ వీడియో కంటెంట్ విన్నర్ అరిడమాన్‌కు అవార్డ్ ఇచ్చినప్పుడు ట్రైన్ లో సీటు కోసం తాను ఏం చేసేవాడో ప్రధాని చెప్పాడు.
ALSO READ :- క్లైమాక్స్ కి చేరిన టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తు - ఢిల్లీలో సీట్లపైన జోరుగా చర్చలు..!
గతంలో తాను ఎక్కువగా ట్రైన్ జర్నీ చేసేవాడినని అన్నారు. రైల్లల్లో రద్దీ కారణంగా రిజర్వేషన్ సీటు దొరకకపోయేదని.. అప్పుడు తాను జనరల్ బోగీలో ప్రయాణించేవాడినని ప్రధాని తెలిపారు. జనరల్ బోగీలో సీటు అసలు దొరకకపోయేదని ఆ టైంలో ట్రైన్ లో ప్రయాణికుల చేయి చూసి జోతిష్యం చెప్పేవాడట. దీంతో వెంటనే అప్పుడు ఎవరోఒకరు సీటు ఇచ్చేవారని మోదీ చెప్పుకొచ్చారు. అలా తన తెలివిని ఉపయోగించి ట్రైన్ లో సీటు సంపాధిచేవాడినని చెప్పారు. దీంతో ఆ ప్రొగ్రామ్ కి వచ్చిన వారందరూ ఒక్కసారిగా నవ్వులు పూయించారు.