వెలిగిపోతున్న అయోధ్య.. ఫోటోలను ట్వీట్ చేసిన మోదీ

వెలిగిపోతున్న అయోధ్య.. ఫోటోలను ట్వీట్ చేసిన మోదీ

దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  బాణసంచా మోత మోగుతోంది. పిల్లలు పెద్దలు. టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

మరో వైపు  దీపావళి సందర్భంగా యూపీలోని అయోద్య నగరం దీపకాంతులతో  వెలిగిపోతున్న ఫోటోలను మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. లక్షలాది దీపాలతో అయోధ్య అద్భుతంగా ,అపూరూపంగా కనిపిస్తోందన్నారు. ఈ కాంతుల నుంచి వచ్చే వెలువడే శక్తి దేశంలో కొత్త ఉత్సహాన్ని నింపుతోందని చెప్పారు.  శ్రీరాముడు దేశ ప్రజలందరికీ  స్ఫూర్తిగా నిలవాలని ట్వీట్ చేశారు. నవంబర్ 11న 22లక్షల దీపాలతో జరిగిన దీపోత్సవం  ప్రపంచ రికార్డు సృష్టించింది.

నవంబర్ 12న ఉదయం  హిమాచల్ ప్రదేశ్ లోని లేప్చాలో ఆర్మీ సిబ్బందితో కలిసి మోదీ దీపావళి పండగను జరుపుకున్న  సంగతి తెలిసిందే. తాను ప్రతి యేటా భద్రతా ధళాలలతో కలిసి దీపావలి సెట్రబేట్ చేసుకుంటానన్నారు. మన సైన్యం బార్డర్ లో హిమాలయాలవలె  స్థిరంగా ఉన్నంత కాలం దేశం సురక్షితంగా ఉంటుందన్నారు మోదీ.