PM Modi: సింగపూర్ టూర్..ఢోల్ వాయించిన ప్రధాని మోదీ..రాఖీ కట్టిన ఎన్నారై

PM Modi: సింగపూర్ టూర్..ఢోల్ వాయించిన ప్రధాని మోదీ..రాఖీ కట్టిన ఎన్నారై

ప్రధాని మోదీ సింగపూర్ లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బుధవారం (సెప్టెంబర్ 4)న సింగపూర్ లోని బ్రూనై చేరుకున్నారు.  ప్రధాని మోదీకి అక్కడి చాంగీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు సింగపూర్ అధికారులు. 

ప్రధాని రాకతో సింగపూర్ లో ఉన్న భారతీయ ఎన్నారైలు సంబరాలు చేసుకున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఢోళ్లు వాయిస్తూ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా సరదాగా ఢోలు వాయించి ఎన్నారైలను ఉత్సాహ పర్చారు. 

సింగపూర్ లో ప్రధాని మోదీ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఇందులో భాగంగా తన కౌంటర్ లారెన్స్ వాంగ్, అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, సీనియర్ మంత్రి లీ సీన్ లూంగ్ , ఎమిరిటస్ సీనియర్ మంత్రి గో చోక్ టోంగ్‌లను కలువనున్నారు.  వాంగ్, లీలు స్పెషల్ విందుతో మోదీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు.  

సింగపూర్ పర్యటనలో ప్రధాని మోదీ ఢోలు వాయించిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధాని మోదీకి సింగపూర్ ప్రజలు ఘనంగా స్వాగతం పలికిన తీరు ఈ వీడియోలో కనిపిస్తుంది. 

దాపు ఆరేళ్ల తర్వాత ప్రధాని మోదీ మొదటిసారి సింగపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఓ ఎన్నారై రాఖీ కట్టిన దృశ్యాలు కూడా వీడియో కనిపిస్తున్నారు. ప్రధాని మోదీతో కలిసి సెల్ఫీ దిగేందుకు ఎన్నారైలు ఎగబడ్డారు.. దీంతో మోదీ బస చేసిన హోటల వద్ద కొందరు వ్యక్తులకు ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు.