
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పనైపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ్ సంకల్ప్ సభలో ప్రధాని మాట్లాడుతూ.. మే13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారన్నారు. తెలంగాణలో క్రమంగా బీజేపీ బలపడుతోందని చెప్పారు. వికసిత్ భారత్ కోసం ఓటు వేయబోతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందే మూడోసారి మోదీ ప్రధాని అవుతారని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రూ.వేల కోట్లు దోచుకుందని విమర్శించారు. గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఈ సారి ఎన్డీఎ 400 సీట్లు గెలిచి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.