ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను లాక్కుని.. ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం: మోదీ

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను లాక్కుని.. ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం: మోదీ

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీ ఆర్ కు కప్పం కడుతోందన్నారు. డబుల్ ఆర్ నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కావాలన్నారు. మే 8వ తేదీ బుధవారం ఉదయం వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..  రాజ్యాంగ బద్దంగా అంబేడ్కర్ కల్పించిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను లాక్కుని..  ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు మోదీ.  ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను తగ్గించిందే కాంగ్రెస్ అని చెప్పారు.  మాదిగలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అడ్డుపడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలతో ఓబీసీలకు నష్టం జరుగుతుందన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్పష్టమైన అవగాహన ఉందని..రెండు పార్టీల మధ్య అవగాహనకు కాళేశ్వరం, ఓటుకు నోటు కేసులే ఉదాహరణ అని ప్రధాని అన్నారు.   హైదరాబాద్ లో ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శలు చేశారు. హైదరాబాద్ ను ఎంఐఎంకు కాంగ్రెస్ దారాదత్తం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎన్నికలు రాగానే కాంగ్రెస్.. అంబానీ, అదానీపై మాట్లాడటం లేదన్నారు. అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుందని ప్రశ్నించారు.