ఈ ఐదేళ్లు దేశ ప్రగతి కోసం కొట్లాడుదాం: ప్రధాని మోదీ

ఈ ఐదేళ్లు  దేశ ప్రగతి కోసం కొట్లాడుదాం: ప్రధాని మోదీ

2047 లక్ష్యంతో ఎన్డీయే పనిచేస్తుందన్నారు ప్రధాని మోదీ.  ఐదేళ్లు దేశ ప్రగతి కోసం కొట్లాడుదామని చెప్పారు.  దేశ ప్రగతి కోసం  ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. కొన్నిపార్టీలు అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు మోదీ. 

Also Read :- శౌర్య చక్ర అందుకున్న రైతు ఇంటిపై టెర్రరిస్టుల కాల్పులు

దేశానికి దిశానిర్దేశం చేసేలా కేంద్ర బడ్జెట్ ఉంటుందన్నారు మోదీ. వికాస్ యాత్రలో ఈ  బడ్జెట్ కీలకమన్న మోదీ..  ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని చెప్పారు. గత మూడేళ్లుగా 8 శాతం వృద్ధి దిశగా కేంద్రం కృషి చేస్తోందన్నారు.  బడ్జెట్ తమ ప్రభుత్వ లక్ష్యాలను  నిర్దేశిస్తుందన్నారు.  ప్రజలు తమపై నమ్మకం ఉంచి  మూడోసారి గెలిపించారని..వారి నమ్మకాన్ని నిలబెడుతామనిచెప్పారు. అమృత్ కాల్ కు ఈ  బడ్జెట్ నాంది పలకనుందన్నారు మోదీ.

జూలై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.   ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రశ్నోత్తరాలతో లోక్ సభ..జీరో అవర్ తో రాజ్యసభ ప్రారంభం కానుంది. ఇక ఇవాళ పార్లమెంట్ ముందుకు ఎకనామిక్ సర్వే రానుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు లోక్ సభలో .. రాజ్యసభలో  మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సర్వేను ప్రవేశపెట్టానున్నారు నిర్మలాసీతారామన్. 23న పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇక కేంద్రప్రభుత్వం  ఆరు బిల్లులను సభ ఆమోదం కోసం తీసుకురానుంది.