
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. జనవరి 16వ తేదీ మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి లేపాక్షి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానికి అలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయాన్ని సందర్శించిన మోదీ.. వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం ప్రధాని మోదీ.. గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర కొత్తగా నిర్మించిన నాసిన్ కేంద్రానికి బయల్దేరి వెళ్లారు. నాసిన్ కేంద్రంలో రూ.541 కోట్లతో నిర్మించిన క్యాంపస్ భవనాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నాసిన్ కేంద్రాన్ని దాదాపు 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు.
#WATCH | Prime Minister Narendra Modi offers prayers at the Veerbhadra Temple in Lepakshi, Andhra Pradesh pic.twitter.com/MeUWCc7h58
— ANI (@ANI) January 16, 2024