![బండి చెయ్యి పట్టుకుని.. మోడీ విషెస్..ఎయిర్ పోర్టులో స్పెషల్ ట్రీట్](https://static.v6velugu.com/uploads/2023/04/bandisanjya_F9UPEfOjQX.jpg)
హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో దిగిన ప్రధానమంత్రి మోడీకి గవర్నర్ తమిళిసై, బీజేపీ ఎంపీలు, రాష్ట్ర నేతలు అందరూ గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. ఈ సందర్భంగా మోడీ – ఎంపీ బండి సంజయ్ ఫొటో అందరి దృష్టికి ఆకర్షించింది. ప్రధాని మోడీకి బండి సంజయ్ నమస్కారం చేయగా.. బండి చేతులు పట్టుకుని మరీ నవ్వారు మోడీ. ఈ సమయంలో పక్కనే ఉన్న ఎంపీ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నవ్వూతూ కనిపించారు. అందరూ నమస్కారం చేయగా.. మోడీ కూడా ప్రతి నమస్కారం చేస్తూ వచ్చారు. బండి సంజయ్ దగ్గరకు రాగానే చేతులు పట్టుకుని మరీ.. నవ్వుతూ విషెస్ స్వీకరించటంతోపాటు.. ప్రత్యేక అభినందనలు చెప్పారు మోడీ.
దీనికి కారణం లేకపోలేదు.. పదో తరగతి పేపర్ లీక్ కేసులో రెండు రోజులు జైలులో ఉండి వచ్చారు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. ఎంపీగా ఉన్న బండి సంజయ్ అర్థరాత్రి అరెస్ట్ కావటం.. ఆ తర్వాత రెండు రోజులు జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. బండి అరెస్ట్ పై ప్రధాన మంత్రి ప్రత్యేకంగా చర్చించిన విషయం తెలిసిందే.
బెయిల్ పై బయటకు వచ్చిన వెంటనే ప్రధాని మోడీ హైదరాబాద్ రావటం.. ఎయిర్ పోర్టులో స్వాగతం పలకటం జరిగింది. బండి సమస్కారం చేయగా.. అతని చెయ్యి పట్టుకుని మరీ మోడీ భరోసా ఇచ్చినట్లు ఉంది ఈ ఫొటో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది...