దేశ అభివృద్ధిపై చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నా: మోదీ

దేశ అభివృద్ధిపై చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నా: మోదీ

పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇండియా కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రధాని మోదీ. పార్లమెంట్ లో అర్థవంతమైన చర్చలు జరగకుండా సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాయన్నారు. అధికారం కోసం పాకులాడే పార్టీలను ప్రజలు తిరస్కరించిన వారి తీరు మారడం లేదన్నారు. ప్రతిపక్షాలు ప్రజల సమస్యలు కాకుండా సొంత ఎజెండాతో పనిచేస్తున్నాయని మండిపడ్డారు మోదీ.  ఇప్పటికైని విపక్ష పార్టీలు సభలో ఫలవంతమైన చర్చలు జరిగేలా సహకరించాలని కోరారు ప్రధాని.  రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయని అన్నారు

Also Read :- కోస్ట్ గార్డ్ చరిత్రలోనే హయ్యేస్ట్.. 5 టన్నుల డ్రగ్స్ స్వాధీనం

రాజ్యసభ వాయిదా

మరో వైపు రాజ్యసభలో తొలి రోజే గందరగోళం నెలకొంది. అదానీ లంచం ఆరోపణల అంశంపై చర్చకు డిమాండ్ చేశారు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే.  పార్లమెంట్ లో చర్చించాల్సిన ముఖ్యమైన అంశాల్లో ఇదే ఫస్ట్ ప్రయారిటీలో ఉంటుందన్నారు. అదానీని ప్రధాని మోదీ కాపాడుతున్నారని విమర్శించారు. ఐతే ఖర్గే లేవనెత్తిన అంశాన్ని చర్చించేందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇండియా కూటమి నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో  సభను వాయిదా వేశారు జగదీప్ ధన్కడ్.