నవీన్ మృతి పట్ల మోడీ సంతాపం

నవీన్ మృతి పట్ల మోడీ సంతాపం

ఉక్రెయిన్‌లో మృతి చెందిన భారతీయ వైద్యా విద్యార్థి నవీన్ తండ్రికి ప్రధాని నరేంద్ర మోడీ కాల్ చేశారు. నవీన్ తండ్రితో ఫోన్లో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఇప్పటికే కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై కూడా నవీన్ తండ్రికి ఫోన్ చేసి మాట్లాడారు. నవీన్ కటుంబాన్ని ఓదార్చురు. నవీన్ భౌతిక కాయం త్వరగా భారత్‌కు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అతని కుటుంబానిక అండగా ఉంటామని తెలిపారు.

ఖర్కివ్‌లో ఈరోజు ఉదయం జరిగిన రష్యా బాంబు దాడిలో నవీన్ చనిపోయాడు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ అరిందం బాగ్చి ట్విట్టర్‌లో తెలిపారు. విద్యార్థి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. మృతుడిని కర్ణాటకలోని హవేరి జిల్లా చలగేరి గ్రామానికి చెందిన నవీన్ శేఖరప్పగా గుర్తించారు. నవీన్ ఉక్రెయిన్‌లో మెడిసిన్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం సూపర్‌ మార్కెట్‌ ముందు నవీన్ ఉండగా బాంబు దాడి జరిగింది.

ఇవి కూడా చదవండి:

ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి మృతి

నవీన్ కుటుంబానికి అండగా ఉంటాం