‘‘గందగి ముక్త్ భారత్’’ డ్రైవ్ స్టార్ట్ చేసిన మోడీ

న్యూఢిల్లీ: ప్రధానిమోడీ శనివారం ఢిల్లీలో ‘‘ గందగిముక్త్ భారత్’’ డ్రైవ్ ను ప్రారంభించారు. శనివారం నుంచి ఆగస్టు15 వరకు వారం పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈడ్రైవ్ లో భాగంగా వారం రోజుల పాటు స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ఇంటి ఆవరణ, చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్త లేకుండా పరిశుభ్రం చేయాలని కోరారు. స్వచ్ఛ్ భారత్ స్పూర్తితో ఈ డ్రైవ్ ను విజయవంతం చేయాలన్నారు. అనంతరం స్వచ్ఛభారత్ మిషన్‌పై ఇంటరాక్టివ్ ఎక్స్‌‌పీరియన్స్ సెంటర్ గా ఏర్పాటు చేసిన రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని (ఆర్ఎస్‌‌కే) ఆయన స్టార్ట్ చేశారు. మహాత్మాగాంధీ చేపట్టిన చంపారన్ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. 2014లో చేపట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం ద్వారా బహిరంగమల విసర్జనను పూర్తిగా తగ్గించామని ప్రధాని అన్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ లో భాగంగా దేశంలో శుభ్రత పెరిగిందని, కరోనా లాంటి మహమ్మారిని కూడా పరిశుభ్రత పాటిస్తే దూరం చేయవచ్చని చెప్పారు.

For More News…

సగం సంక్షేమ హాస్టళ్లు కిరాయి బిల్డింగుల్లోనే