
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన పలువురిని ఆహ్వానించారు. అలాగే, పారిశుధ్య కార్మికులకూ ఆహ్వానం అందజేశారు. కార్యక్రమానికి ముందు ట్రాన్స్జెండర్లను బీజేపీ ఎంపీ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ మాజీ మంత్రి వీరేంద్ర కుమార్ ఆయన నివాసంలో సన్మానించారు. పారిశుధ్య కార్మికులకు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్సన్మానం చేశారు.
అనంతరం ట్రాన్స్జెండర్లు, పారిశుధ్య కార్మికులు రాష్ట్రపతి భవన్లో జరిగిన మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఇలాంటి కార్యక్రమాలకు ట్రాన్స్జెండర్లను పిలువడం ఇదే తొలిసారి అని వీరేంద్ర కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారు ట్రాన్స్జెండర్ల సాధికారతకు సహకారం అందించినట్టు చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు తమ కమ్యూనిటీకి చెందిన 50 మందితో కలిసి వచ్చానని యూపీ బీజేపీ యూనిట్‌కు చెందిన సోనమ్ కిన్నర్ తెలిపారు.