11వేల FIRలు నమోదు చేసి 500 మందిని అరెస్ట్ చేశాం : మోదీ

11వేల FIRలు నమోదు చేసి 500 మందిని అరెస్ట్ చేశాం : మోదీ

గత ఏడాది మేలో మణిపూర్ లో చెలరేగిన హింసాకాండ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మణిపూర్ అల్లర్లపై ప్రధాని వివరణ ఇవ్వాలని మంగళవారం లోక్ సభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. బీజేపీ మణిపూర్ లో హింసను ప్రోత్సహిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై మోదీ బుధవారం రాజ్యసభలో మాట్లాడారు. మణిపూర్ లో శాంతి నెలకొల్పడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు.11వేలకు పైగా ఎఫ్ ఐఆర్ హింసకు కారణమైన వారిపై నమోదు చేశామని, అందులో 500 మందిని అరెస్ట్ కూడా చేశామని ఆయన తెలిపారు. 

మణిపూర్ సమస్యను రాజకీయం చేయడం మానేయండని ప్రధాని విపక్షాలపై మండిపడ్డారు. చాలా ప్రాంతాల్లో ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయని మోదీ అన్నారు. హింసాత్మక సంఘటనలు తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు.  2023 మేలో ఇంఫాల్ వ్యాలీకి చెందిన మెయిటీస్, కొండజాతి అయిన కుకీ వర్గాల మధ్య వర్గపోరు నడిచింది. దాదాపు ఇప్పటికీ వరకు ఆ అల్లర్లలో 200 మందికి పైగా చినిపోయారు. తాజాగా జూన్ లో కూడా మళ్లీ అక్కడ తెగలు ఘర్ణణలకు దిగారు.