మోడీ కీలక వ్యాఖ్యలు... కేసీఆర్ బిడ్డ బాగుండాలంటే బీఆర్ఎస్కు ఓటేయండి

మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన అనంతరం భోపాల్ లో ఏర్పాటు చేసిన సభలో కుటుంబ రాజకీయాలపై ఆయన మాట్లాడుతూ ..  మీకు, మీ బిడ్డలకు మంచి జరగాలంటే బీజేపీకి ఓటేయ్యాలని .. కేసీఆర్  బిడ్డ కవితకు లాభం చేయాలనుకుంటే బీఆర్ఎస్ కు ఓటేయ్యలని పిలుపునిచ్చారు.

ALSO READ:హైదరాబాద్‌కు అన్యాయం.. తెలుగు గడ్డపై బీసీసీఐకి ఈ వివక్ష ఎందుకు?

తన మాట దేశమంతా వినాలంటూ మోడీ కామెంట్ చేశారు. ఢిల్లీ  లిక్కర్ స్కామ్ లో కేంద్ర ప్రభుత్వం కవితకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.