హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై ప్రధాని మోదీ ప్రశంసలు

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై ప్రధాని మోదీ ప్రశంసలు

హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లతపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు.  ఆమె పాల్గొన్న ఆప్ కీ అదాలత్ ఎపిసోడ్ అసాధారణమైందని మోదీ కొనియాడారు. ఎంతో ప్యాషన్‌తో ఆ ఎపిసోడ్‌లో బలమైన పాయింట్లు మాట్లాడారని పేర్కొన్నారు. ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా  మాధవి లత ఎపిసోడ్ అందరూ చూడాల్సిందిగా మోదీ కోరారు.  

49 ఏళ్ల కొంపెల్ల మాధవి లత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరుపున  హైదరాబాద్‌ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.  అక్కడినుంచి బరిలోకి దిగిన మొదటి మహిళా అభ్యర్థి మాధవి లతనే కావడం  విశేషం. హైదరాబాద్‌లో ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో ఆమె పోటీ పడుతున్నారు.   మాధవి లత ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్నారు.