
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపినందుకు ప్రధాని థ్యాంక్స్
న్యూఢిల్లీ, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపిన తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి, ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు నా అభినందనలు. ప్రజల మధ్య చాలా శ్రద్ధగా పని చేస్తున్న పార్టీ కార్యకర్తలను చూసి గర్వపడుతున్నాను”అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. అలాగే , ఏపీలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన అభ్యర్థులను అభినందించారు.