
పోర్ట్ లూయిస్: వచ్చే నెల (మార్చి) 12న జరుగనున్న మారిషస్ 57వ నేషనల్ డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ చీఫ్ గెస్టుగా హాజరవుతారని ఆ దేశ ప్రధాని నవీన్ రామ్ గూలమ్ ప్రకటించారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు రాబోయే వేడుక సాక్ష్యంగా నిలుస్తుందని తెలిపారు.
శుక్రవారం నేషనల్ అసెంబ్లీలో ప్రధాని రామ్ గూలమ్ మాట్లాడారు. మోదీ తమ ఆహ్వానాన్ని అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. కాగా, నిరుడు మారిషస్ నేషనల్ డే వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.