ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే..

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో ప్రయతించానున్నారు. ఈ నెల 7, 8వ తేదీలలో  రెండు రోజుల పాటు కూటమి తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు మోడీ. 7వ తేదీ సాయంత్రం 3:30గంటలకు రాజమండ్రిలో కూటమి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు మోడీ. ఆ తర్వాత వేమగిరిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు, అదే రోజున సాయంత్రం 5:45గంటలకు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొననున్నారు మోడీ.

ఆ తర్వాత 8వ తేదీన అన్నమయ్య జిల్లా పీలేరులో సాయంత్రం 4గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం 7గంటలకు విజయవాడలో ప్రచారంలో పాల్గొననున్నారు మోడీ. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు ప్రధాని మోడీ రోడ్ షో సాగనుంది. ఈ మేరకు ప్రధాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది బీజేపీ. టీడీపీ, జనసేనలతో పొత్తు కుదిరిన తర్వాత మోడీ రాష్ట్రంలో ప్రయతించటం ఇది రెండోసారి. మొదట ఈ నెల 3, 4వ తేదీల్లో మోడీ పర్యటన ప్లాన్ చేయాలని భావించినప్పటికీ ప్రధాని బిజీ షెడ్యూల్ వల్ల 7, 8వ తేదీలకు షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది.