AI ప్రతికూల ప్రభావం ఆందోళన కలిగిస్తోంది..డీప్ఫేక్ ప్రమాదకరం: ప్రధాని మోదీ

AI ప్రతికూల ప్రభావం ఆందోళన కలిగిస్తోంది..డీప్ఫేక్ ప్రమాదకరం: ప్రధాని మోదీ

G20 ప్రెసిడెన్సీ ముగింపు సందర్భంగా బుధవారం(నవంబర్ 22న) ప్రధాని మోదీ అధ్యక్షతన వర్చువల్ జి20 లీడర్స్ సమ్మిట్ ను నిర్వహించారు.9 అతిథి దేశాలు, 11 అంతర్జాతీయ సంస్థల అధిపతులు, మొత్తం 20 జి20 సభ్య దేశాల నాయకులతో పాటు ఆఫ్రీకన్ యూనియన్ అధ్యక్షుడు ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ సమావేశాన్ని స్కిప్ చేసినట్లు తెలుస్తోంది. రష్యా ప్రధాని పుతిన్ సమావేశంలో పాల్గొన్నారు. 

సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..  సవాళ్లతో కూడిన నేటి ప్రపంపచంలో పరస్పర విశ్వాసం ఒకరితో ఒకరిని కలుపతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత సమస్యలు, పరిస్థితులపై మాట్లాడిన మోదీ.. ఇజ్రాయెల్, గాజాలో పరిస్థితులపై చర్చించారు.గాజాలో బందీలుగా ఉన్న వారి విడుదల వార్తలను స్వాగతిస్తున్నాం.. బందీలందరినీ త్వరలో విడుదల చేస్తారని ఆశిస్తున్నామని మోదీ అన్నారు. 

G20 వర్చువల్ సమ్మిట్ లో ప్రధాని మోదీ  డీప్ ఫేక్ సమస్యపై మాట్లాడుతూ.. AI ప్రతికూల ప్రభావాలగురించి ప్రపంపం ఆందోళన చెందుతోందన్నారు. AI కోసం ప్రపంప నిబంధనలపై సభ్యదేశాలు కలిసి పనిచేయాలని భారత్ ఆశిస్తోందన్నారు. సమాజానికి డీప్ ఫేక్ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవడం..డీప్ ఫేక్ లనుంచి సమాజాన్ని కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.