గోదావరిఖని : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) ప్లాంట్‌ను నవంబర్ 12న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో సెంట్రల్ ఫెర్టిలైజర్స్, కెమికల్స్ మినిస్ట్రీ సెక్రటరీ అరుణ్ సింఘాల్ శనివారం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను సందర్శించారు.
ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల గురించి మాట్లాడారు. ముందుగా ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌లోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఎన్టీపీసీ టౌన్ షిప్‌లో హెలీప్యాడ్, మీటింగ్ నిర్వహించే మహాత్మా గాంధీ స్టేడియంను కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం సీపీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డితో కలిసి చూశారు.