lift sea bridge: తొలి లిఫ్ట్ బ్రిడ్జ్(పంబన్ వంతెన) ప్రారంభం.. జాతికి అంకితం చేసిన ప్రధానిమోదీ

 lift sea bridge: తొలి లిఫ్ట్ బ్రిడ్జ్(పంబన్ వంతెన) ప్రారంభం.. జాతికి అంకితం చేసిన ప్రధానిమోదీ

శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం(ఏప్రిల్ 6) తమిళనాడులోని రామనాథపురంలో కొత్త పంబన్ లిఫ్ట్ బిడ్ర్ ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. భారతదేశంలో తొలి సముద్ర లిఫ్ట్ బ్రిడ్జ్ అయిన  కొత్త పంబన్ వంతెన తమిళనాడులోని పాక్ జలసంధిపై 2.07 కిలోమీటర్ల పొడవున ఈవంతెన విస్తరించి ఉంది. 

రామేశ్వరం ద్వీపాన్ని తమిళనాడుతో కలిపేందుకు ఏర్పాటు చేసిన వంతెన ఇది. దీనిలో షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ స్పాన్‌తో కూడిన కాంటిలివర్ నిర్మాణం ఉంటుంది. ఈ విధానంలో ఒకే లైన్ కోసం తయారు చేయబడిన 18.3 మీటర్ల స్టీల్ ప్లేట్ గిర్డర్‌ల 88 స్పాన్‌లు ఉన్నాయి. ఈ వంతెనలో రెండు ట్రాక్‌లతో 72.5 మీటర్ల పొడవున్న నిలువు లిఫ్ట్ ఉంది.