మే 2 ప్రధాని మోదీ ఏపీ టూర్​: అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం

 మే 2 ప్రధాని మోదీ ఏపీ టూర్​:  అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం

ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్​ లో పర్యటించనున్నారు.  మే 2 వ తేదీన  43 వేల కోట్ల  విలువైన అమరావతి పునర్నిర్మాణ  పనులు ప్రారంభిస్తారని ఏపీ మంత్రి పి. నారాయణ తెలిపారు.  ప్రధాని  అమరావతి పర్యటనకు సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి  తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించిన ఆయన  మూడేళ్లలో  గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరాన్ని నిర్మిస్తామన్నారు.  

ప్రధానమంత్రి మే 2వ తేదీ మధ్యాహ్నం 3.25 గంటలకు వస్తారని తెలిపారు.  అమరావతికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌లో 365 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1,500 లేఅవుట్ రోడ్లను రూపొందించామన్నారు. 2019కి ముందు రూ.5వేల  కోట్ల బిల్లుల చెల్లింపులతో పాటు, రూ.41వేలకోట్ల పనులు  ప్రారంభమైనప్పటికీ...గత  ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని మంత్రి నారాయణ ఆరోపించారు. 

►ALSO READ | విశాఖలో పాక్​ కుటుంబం.. తమను వెనక్కు పంపొద్దని వినతి..

అమరావతి రాజధాని విషయంలో  గత   ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ... ఇతర కోర్టు సమస్యలు సృష్టించిదన్నారు.  ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు  సోమవారం ( ఏప్రిల్​ 28)  అమరావతిలోని 29 గ్రామాల రైతులతో రెండు గంటల పాటు చర్చించి...  గ్రీన్‌ఫీల్డ్ రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి వారిని వ్యక్తిగతంగా ఆహ్వానించారని నారాయణ తెలిపారు.   అమరావతిపై చట్టబద్ధత కోసం పార్లమెంటరీ చట్టం తీసుకురావాలని రైతులు ముఖ్యమంత్రిని కోరారని మంత్రి నారాయణ  హైలైట్ చేశారు.