- భరూచ్ జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన
భరూచ్ (గుజరాత్): అర్బన్ నక్సల్స్ వారి రూపాన్ని మార్చుకొని, గుజరాత్‌లోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన అమాయక యువతను తప్పుదోవ పట్టించేందుకు వారు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని భరూచ్ జిల్లాలో దేశంలోనే తొలి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సోమవారం మోడీ శంకుస్థాపన చేశారు. తర్వాత ఆయన మాట్లాడారు. ‘‘అర్బన్ నక్సల్స్ పైనుంచి మనపై కాలు మోపుతున్నారు. దేశాన్ని నాశనం చేస్తున్నారు. వారు వీదేశీ శక్తుల ఏజెంట్లు. మన యువతరాన్ని నాశనం చేయనివ్వబోం. మన పిల్లలను కాపాడుకోవాలె. ఎట్టి పరిస్థితుల్లోనూ గుజరాత్ వారికి తలవంచదు” అని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్టును ఆపేందుకు నక్సల్స్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు శాయశక్తులా ప్రయత్నించారని మోడీ అన్నారు. బెంగాల్, జార్ఖండ్, బీహార్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశా, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నక్సలిజం ప్రారంభమైందని, ఆదివాసీ యువకుల జీవితాలను నక్సలైట్లు నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నక్సలిజం నిర్మూలన తనకు సవాల్‌గా ఉండేదని చెప్పారు. దేశంలోని అనేక చిన్న రాష్ట్రాలతో పోలిస్తే భరూచ్‌లో ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయని, అక్కడ వచ్చిన ఉద్యోగాల సంఖ్య కూడా ఒక రికార్డు అని మోడీ పేర్కొన్నారు.
ఇయ్యాల మహాకాల్ కారిడార్ జాతికి అంకితం..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శ్రీమహాకాల్ లోక్ (కారిడార్) మొదటి దశను ప్రధాని మోడీ మంగళవారం జాతికి అంకితం చేస్తారని ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. 900 మీటర్లకుపైగా పొడవున్న ఈ కారిడార్ దేశంలోని అతిపెద్ద కారిడార్‌లలో ఒకటని అధికారులు వెల్లడించారు.