T20 World Cup 2024: భారత ఆటగాళ్లతో ప్రధాని సమావేశం.. ముహూర్తం ఖరారు

T20 World Cup 2024: భారత ఆటగాళ్లతో ప్రధాని సమావేశం.. ముహూర్తం ఖరారు

కరేబియన్ గడ్డపై విశ్వ విజేతగా నిలిచి.. దేశ ప్రతిష్టను మరో మెట్టు ఎక్కించిన భారత క్రికెట్ జట్టును ప్రధాని నరేంద్ర మోడీ కలవనున్నారు. ఆటగాళ్లతో ప్రత్యేకంగా సమావేశమై చారిత్రాత్మక, చిరస్మరణీయ విజయానికి కారణమైన వారికి అభినందనలు తెలియజేయనున్నారు. ఇప్పటికే అందుకు ముహూర్తం కూడా ఖరారైంది. రేపు (జూలై 4) ఉదయం 11 గంటలకు రోహిత్ సేనతో మోఢీ సమావేశం కానున్నారు. 

బెరిల్‌ హరికేన్‌ ప్రభావంతో బార్బడోస్‌లో చిక్కుకుపోయిన భారత క్రికెట్‌ బృందం ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన స్పెషల్ ఫ్లైట్‌లో వీరు భారత్‌కు పయనమయ్యారు. ఈ విమానం గురువారం(జులై 4) ఉదయం 6 గంటలకల్లా ఢిల్లీ చేరుకోనుంది. వీరు రాజధాని నగరంలో అడుగుటపెట్టాక, కాలకృత్యాలు తీర్చుకున్నాక ప్రధానితో సమావేశం జరగనుంది.

అప్పుడు ఓదార్పు..

కాగా, గతేడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయిన అనంతరం మోడీ.. భారత డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శించారు. ఆ సమయంలో ఆటగాళ్లను ఓదార్చి వారిలో ధైర్యాన్ని నూరిపోశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.