
హైదరాబాద్, వెలుగు: పీఎం కిసాన్ 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. బిహార్ లోని భాగల్ పూర్ లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు.
దేశంలోని 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లు జమ చేయనున్నారు. ఈ పథకంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన దాదాపు 36 లక్షల మందికిపైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ.800 కోట్లకుపైగా నిధులు విడుదల కానున్నాయి.