రైతులకు గుడ్ న్యూస్.. జూన్ 18న రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ

రైతులకు గుడ్ న్యూస్.. జూన్ 18న రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ

రైతులకు గుడ్ న్యూస్..  త్వరలోనే  రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ కానున్నాయి. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన మోదీ.. తొలిసారి తన సొంత పార్లమెంట్ నియోజకవర్గం వారణాలో పర్యటించనున్నారు.  2024, జూన్ 18వ తేదీన వారణాసిని మోదీ సందర్శించనున్నారు. అదే రోజు దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మంది లబ్ధిదారులకు పిఎం-కిసాన్ పథకం కింద 17వ విడతలో రూ. 20వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేయనున్నారు. 

అలాగే.. వ్యవసాయ పద్ధతులతో రైతులకు మద్దతుగా నిలుస్తూ పారా-ఎక్స్‌టెన్షన్ వర్కర్లుగా పనిచేయడానికి ‘కృషి సఖి’లుగా శిక్షణ పొందిన 30వేల మందికి పైగా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జి) సభ్యులకు ప్రధాని మోదీ సర్టిఫికేట్‌లను అందజేయనున్నారు.

ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం నిబద్ధతతో కట్టుబడి ఉందని చెప్పారు. “ప్రధానమంత్రి మోదీ గత 10ఏళ్ల కాలంలోనూ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చారు.  రైతుల ప్రయోజనాల కోసం ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధులు విడుదలకు సంబంధించిన ఫైల్‌పై మోదీ.. తొలి సంతకం చేశారు’’ అని చౌహాన్ చెప్పారు.