![ఈ నెల 12న అమెరికాకు మోదీ](https://static.v6velugu.com/uploads/2025/02/pm-modi-to-visit-america-on-february-12_xS0jn6otWA.jpg)
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మోదీ ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ శుక్రవారం వెల్లడించారు. మోదీ ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ యాక్షన్ సమిట్‌లో పాల్గొంటారని చెప్పారు.
భారత భాగస్వామిగా ఉన్న కెడారచీ ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్‌ను మోదీ సందర్శిస్తారని తెలిపారు. 12వ తేదీ సాయంత్రానికి మోదీ వాషింగ్టన్ డీసీకి చేరుకుంటారు. 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అవుతారని పేర్కొన్నారు.