
- థాయిలాండ్, శ్రీలంకలో పర్యటించనున్న ప్రధాని
న్యూఢిల్లీ: ఏప్రిల్ మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ థాయ్‌లాండ్, శ్రీలంకలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఏప్రిల్ 3– 4 తేదీల్లో థాయ్‌లాండ్‌లో జరగనున్న 6వ బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్ స్టెక్) సమిట్‌లో ఆయన పాల్గొననున్నారు.
తర్వాత థాయ్‌లాండ్ ప్రధాని షినవత్రాతో భేటీ కానున్నారు. తర్వాత ఏప్రిల్ 4న మోదీ మూడ్రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంకకు వెళ్లనున్నారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిసనాయకతో సమావేశమవుతారు. దిసనాయక ఇటీవల భారత్‌లో పర్యటించిన సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాలపై చర్చించనున్నారు.