ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారయ్యింది. సెప్టెంబర్ 21 నుంచి23 మూడు రోజుల పాటు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. జో బిడెన్ ఆధ్వర్యంలో డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో జరగబోయే క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొననున్నారు. ఈ సమ్మిట్ కు ప్రధాని మోదీ , ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ పీఎం ఫుమియో కిషిడా సమావేశమవుతారు. ఈ సమ్మిట్ ఈ సారి భారత్ లో జరగాల్సి ఉంది . అయితే అమెరికా విజ్ఞప్తి మేరకు 2025లో క్వాడ్ సమ్మిట్ భారత్ లో నిర్వహించనుంది.
సెప్టెంబర్ 22న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ ఈవెంట్‌కు 24 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 23న న్యూయార్క్లో జరిగే యూఎన్ సమ్మిట్ ఫర్ ధి ప్యూచర్ లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.