వేములవాడకు మోదీ.. బండి సంజయ్కు మద్దతుగా ప్రచారం

వేములవాడకు మోదీ..  బండి సంజయ్కు మద్దతుగా ప్రచారం

ప్రధాని నరేంద్ర మోదీ రేపు అనగా మే 08వ తేదీ బుధవారం రోజున వేములవాడలో పర్యటించనున్నారు.  ఉదయం 8 గంటలకు వేములవాడ ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు.  అనంతరం  పార్లమెంట్ ఎన్నికల క్రమంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతుగా  పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. 

మోదీ పర్యటనలో భాగంగా ఇప్పటికే రాజన్న గుడి చెరువు మైదానంలో మూడు హెలిప్యాడ్ లు సిద్ధం చేశారు అధికారులు. కేంద్ర బలగాలు, జిల్లా పోలీసుల కంట్రోల్ లోకి  పట్టణంలోని చాలా ప్రాంతాలు వెళ్లిపోయాయి. పలు చోట్ల ఆంక్షలు విధించారు.  మీడియాకి కూడ చాలా ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. 1200 మంది పోలీసులతో మోదీ టూర్ కోసం భద్రత చేపట్టారు పోలీసులు. రేపటి వరకు పట్టణంలో డ్రోన్స్ ఉపయోగించరాదని పోలీసులు ఆంక్షలు విధించారు.  

also read : బీజేపీతో దేశానికి అత్యంత ప్రమాదం..మళ్లీ గెలిస్తే ఫ్యూచర్ ఉండదు: భట్టి