The Sabarmati Report: విక్రాంత్ మాస్సే సబర్మతి సినిమాని పార్లమెంట్‌లో వీక్షించనున్న ప్రధాని మోదీ

The Sabarmati Report: విక్రాంత్ మాస్సే సబర్మతి సినిమాని పార్లమెంట్‌లో వీక్షించనున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇవాళ సోమవారం (డిసెంబర్ 2న) సాయంత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’ (The Sabarmati Report) సినిమాను వీక్షించనున్నారు.

‘ట్వల్త్‌‌ ఫెయిల్‌‌’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన విక్రాంత్‌‌ మస్సే(Vikrant Massey) నటించిన 'ది సబర్మతి రిపోర్ట్’ మూవీని నేడు పార్లమెంట్లో చూడనున్నారు ప్రధాని మోదీ.

ఈ సందర్బంగా పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని బాలయోగి ఆడిటోరియంకు (Balyogi Auditorium) ప్రధాని మోదీ వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ డిసెంబర్ 2న ఉదయం విక్రాంత్ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది గంటలకే.. అతని సినిమా చూడాలని PM నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

కాగా, ఇటీవలే Nov 17న అలోక్ భట్ అనే వ్యక్తి ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ సినిమాపై పోస్ట్ చేశారు. '2002 ఫిబ్రవరి 27 ఉదయం మనం కోల్పోయిన 59 మంది అమాయక పురుషులు, మహిళలు మరియు పిల్లలకు ఈ చిత్రం నిజంగా తగిన నివాళి' అంటూ చేసిన ట్వీట్కు మోదీ రెస్పాండ్ అయ్యారు.

Also Read :- బుకింగ్స్ తోనే అరాచకం.. రిలీజ్కు ముందే పుష్ప 2 ఊచకోత

"బాగా చెప్పారు. ఈ నిజం బయటకు రావడం విశేషం, అది కూడా సామాన్యులు చూసే విధంగా. ఒక నకిలీ కథనం పరిమిత కాలం వరకు మాత్రమే కొనసాగుతుంది. ఎట్టకేలకు, వాస్తవాలు ఎప్పుడో బయటకు వస్తాయని" మోదీ పోస్టులో వెల్లడించారు.

ధీరజ్ సర్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 15న థియేటర్స్లో రిలీజైంది. 2002 ఫిబ్రవరి 27 ఉదయం గోద్రాలో జరిగిన సబర్మతి ఎక్స్‌‌ప్రెస్‌‌ రైలు దహనం ఇన్సిడెంట్‌‌లో.. నిజంగా ఏం జరిగిందనే వాస్తవాలను చూపిస్తూ సాగిన ఈ మూవీ ఆలోచింపజేస్తోంది.

సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక మతపరమైన వేడుకలో పాల్గొని అయోధ్య నుండి తిరిగి వస్తున్న 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భక్తులను చంపిన సంఘటన వెనుక ఉన్న నిజాన్ని వెల్లడిస్తూ సాగిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా మరియు రిధి డోగ్రా కీలక పాత్రల్లో నటించారు.