న్యూఢిల్లీ: అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ పై హత్యాయత్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని స్పష్టం చేశారు. ‘‘నా మిత్రుడు, మాజీ ప్రెసిడెట్ డొనాల్డ్ ట్రంప్ పై దాడితో తీవ్ర ఆందోళనకరం.
ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా” అని మోదీ ఆదివారం ‘ఎక్స్ (ట్విట్టర్)’లో పోస్ట్ చేశారు. కాల్పుల్లో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి సానుభూతి తెలిపారు. గాయపడినవారితోపాటు అమెరికన్ ప్రజల కోసం ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.