మోదీ ట్విట్టర్ డీపీగా భారత్ మండపం

మోదీ ట్విట్టర్ డీపీగా భారత్ మండపం

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శుక్రవారం తన ట్విట్టర్ అకౌంట్ ఖాతా డీపీని చేంజ్ చేశారు.  జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిస్తున్న భారత్ మండపం ఫొటోను తన డీపీగా పెట్టుకున్నారు. ఆ డీపీలో నటరాజ విగ్రహంతో ప్రకాశవంతంగా వెలిగే భారత మండపం కనిపిస్తున్నది. ఇంతకు ముందు దేశ త్రివర్ణ పతాకం ఆయన డీపీగా ఉండేది. ఇవ్వాళా, రేపు ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. దీనికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, తదితరులు హాజరుకానున్నారు.