
దేశంలో తక్కువ పంట దిగుబడి, ఉత్పాదకత తక్కువ ఉన్న వెనుకబడిన జిల్లాల్లో రైతులకు ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2025–26 బడ్జెట్లో పీఎం ధన ధాన్య కృషి యోజన పథకం ప్రారంభించింది.ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా తొలుత ఎంపిక చేసిన 100 జిల్లాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట పొలాలను పరిశీలించి, భూసార పరీక్షలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం నుంచి ప్రేరణ పొంది రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజనను అమలు చేయాలని కేంద్ర బడ్జెట్లో ప్రకటించింది. ఈ పథకం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 1.7కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పంచాయతీ బ్లాక్ స్థాయిల్లో పండించిన పంట నిల్వలను పెంచడం ద్వారా 1.7 కోట్ల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూర్చడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా అవకాశాలను సృష్టించడం దీని లక్ష్యాలు.
Also Read:-హోటల్ మేనేజ్మెంట్ చేశారా..? అయితే ఇది గుడ్ న్యూసే..