
ఛత్తీస్‌గఢ్, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన క్రమంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. "ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లో ప్రజాస్వామ్యానికి పవిత్రమైన పండుగ. మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లందరూ ఓటు వేసి ఈ పండుగలో భాగస్వాములు కావాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఈ సందర్భంగా రాష్ట్రంలో మొదటిసారి ఓటు వేస్తోన్న యువ స్నేహితులందరికీ నా ప్రత్యేక అభినందనలు" అని మోదీ Xలో పోస్ట్ చేశారు.
छत्तीसगढ़ में आज लोकतंत्र के पावन उत्सव का दिन है। विधानसभा चुनाव के पहले चरण के सभी मतदाताओं से मेरा अनुरोध है कि वे अपना वोट जरूर डालें और इस उत्सव के भागीदार बनें। इस अवसर पर पहली बार वोट डालने वाले राज्य के सभी युवा साथियों को मेरी विशेष बधाई!
— Narendra Modi (@narendramodi) November 7, 2023
"రికార్డు సంఖ్యలో ఓటు వేయాలని మిజోరాం ప్రజలకు నేను పిలుపునిస్తున్నాను. యువకులు, మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారు ఈ ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను" అని ప్రధాని మోదీ అన్నారు.
I call upon the people of Mizoram to vote in record numbers. I particularly urge the young and first time voters to exercise their franchise and strengthen the festival of democracy.
— Narendra Modi (@narendramodi) November 7, 2023
- ALSO READ | చత్తీస్గఢ్, మిజోరంలో ఇయ్యాల్నే పోలింగ్